NTV Telugu Site icon

Ratan Tata: రతన్ టాటా మృతి పై స్పందించిన ఆయన మాజీ ప్రేయసి.. ఏమన్నారంటే ?

New Project (96)

New Project (96)

Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన సోమవారం బీపీ పడిపోవడంతో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక రతన్ టాటా మరణించడంతో ఎంతోమంది ఆయన మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. ఇక రతన్ టాటా మరణం పై ఆయన మాజీ ప్రేయసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయన మరణంపై ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. ఇక రతన్ టాటా ఇప్పటివరకు తన జీవితంలో పెళ్లి చేసుకోకుండా బ్రాహ్మచారిగానే ఉన్న విషయం గురించి తెలిసిందే. అయితే రతన్ ప్రేమ విషయం గురించి ఒకానొక సందర్భంలో వెల్లడించారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో సినీ నటి అయిన సిమి గరేవాల్‌ ను ప్రేమించారని పెళ్లి కూడా చేసుకోవాలని కూడా భావించినట్లు తెలిపారు.

Read Also:Vehicles Smuggling: నేషనల్ హైవేపై వాహనాల అక్రమ రవాణా.. విదేశాలకు ఎగుమతి

ఇలా పెళ్లి సమయంలోనే తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. అప్పటికే తనను పెంచిన అమ్మమ్మను చూడక ఏడేళ్లు అయిపోయింది. అందుకే తన అమ్మమ్మను చూడడానికి రాక తప్పలేదు. ఆ సమయంలో చైనా భారత్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆ యుద్ధం కారణంగా సిమి గరేవాల్‌ తల్లిదండ్రులు తనతో పెళ్లి చేసి ఆమెను ఇండియాకు పంపించడానికి ఇష్టపడలేదని స్వయంగా తన ప్రేమ విషయాన్నీ రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా కోరుకున్న అమ్మాయి తన జీవితంలోకి రాకపోవడంతో ఈయన తన జీవితంలో పెళ్లి అనే మాటను దూరం పెట్టారు.

Read Also:OTT : మత్తు వదలరా -2 ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

ఇకపోతే తాజాగా ఈయన మరణం పై ఎంతోమంది ప్రముఖులు స్పందిస్తూ భావోద్వేగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన మాజీ ప్రేయసి సిమి గరేవాల్ కూడా భావోద్వేగ వీడ్కోలు అంటూ పోస్ట్ చేశారు. మీరు చనిపోయారని చాలా మంది అంటున్నారంటూ సిమి గరేవాల్ ట్వీట్ చేశారు..మీ నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం.. వీడ్కోలు నా మిత్రమా.. # రతన్ టాటా అంటూ ట్వీట్ చేశారు. సిమి గరేవాల్‌ రతన్ టాటా తనతో కొంతకాలం డేటింగ్ చేసినట్లు అంగీకరించారు. వారు తరువాత విడిపోయారు కానీ జీవితాంతం సన్నిహిత స్నేహితులుగా కొనసాగారు.

Show comments