నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత.
పాన్ ఇండియా భాషలలో తెరకెక్కతున్న ఈ సినిమా గ్లిమ్స్ ను కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. గ్లిమ్స్ ను ఓ సారి పరిశీలిస్తే’ మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాచలేక…గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరి మోయలేక…అగ్గే బూడిదయింది మండుతున్న నా బిడ్డను చూడలేక… ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక’ డైలాగ్ తో రక్తంతో తడిచి తుపాకీ చేతపట్టి శత్రువలను ఎదుర్కుంటున్న రష్మిక నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించింది. సినిమాపై అంచనాలు పెంచింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తోన్నరష్మిక మైసా తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకునేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి మైసా గ్లిమ్స్ పై ఓ లుక్కేయండి.
Also Read : God Of War : ఎన్టీఆర్ తో కాదని అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా
