Site icon NTV Telugu

Rashmika Serious On Trollers: ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ రష్మిక

Rashmika

Rashmika

Rashmika Serious On Trollers: తనపై వస్తున్న ట్రోల్స్ పై రష్మిక మందన్నా సీరియస్ అయ్యారు. అనవసరంగా తనను ద్వేషిస్తూ, ట్రోల్స్ తో తనను వేధిస్తున్న నెటిజన్ల తీరుపై కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా సీరియస్ గా స్పందించింది. దీనిపై తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెద్ద పోస్ట్ పెట్టింది. దాంట్లో విషయాన్ని వివరంగా రాసుకొచ్చింది. ‘గత కొంత కాలంగా నన్ను కొన్ని విషయాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన సమయం వచ్చింది. దీంతో ఇప్పుడు నా కోసం నేను మాట్లాడుతున్నాను. నిజానికి ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది. నేను నా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎంతో ద్వేషాన్ని ఎదుర్కొంటున్నాను. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో ట్రోల్స్ నన్ను చుట్టుముట్టాయి.. ఇప్పటికీ అవి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలని అనుకోను. అంటే దీనర్థం నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని కాదు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పొచ్చు. కాని ఇలా ట్రోల్ చేయడంలో అర్ధం లేదు’ అని రష్మిక పోస్ట్ చేశారు.

Read Also: Sudigali Sudheer Rashmi: సుడిగాలి సుధీర్ రీఎంట్రీతో ఏడ్చేసిన రష్మీ

అంతే కాకుండా… ‘మిమ్మల్ని సంతోష పెట్టేందుకు నేను నిత్యం ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు. నేను పెట్టిన శ్రమ మీకు ఎంత మేర సంతోషాన్నిస్తుందన్నదే నాకు ముఖ్యం. నా వైపు నుంచి అత్యుత్తమ పనితీరును ఇవ్వడానికే కష్టపడుతున్నాను. కాని ఇలాంటి అవరోధాలు అడుగడుగునా అడ్డు పడుతుంటే.. అనుకున్నవి ఎలా సాధిస్తాను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కొన్ని విషయాలు నాకు ప్రతికూలంగా మారుతున్నాయి. కాని అవి వదిలేసి.. అసలు అర్దం లేని.. ఊహాజనిత విషయాలను పెద్దవి చేసి.. నాపై తప్పుడు ప్రచారంచేస్తున్నారంటూ రష్మిక మండిపడింది. ఇంత నీచమైన పనులు ఎలా చేస్తారు. అంత ద్వేషం ఏమిటి ?’. అంటూ రష్మిక బారెడంత పోస్ట్ తో తనను ద్వేషించే వారికి గట్టి బదులే ఇచ్చింది.

Exit mobile version