NTV Telugu Site icon

Modi: అటల్ సేతు వంతెనపై రష్మిక మందన్న వీడియో.. స్పందించిన మోడీ

Rashmika Mandanna

Rashmika Mandanna

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ సినిమాలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా బాగా పాపులర్ అయ్యింది. రష్మిక గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా రణబీర్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘యానిమల్’లో కనిపించింది. ఇప్పుడు రష్మిక అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక మందన్న అటల్ సేతు వంతెనను పొగుడుతూ కనిపించింది. ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి 2 గంటల సమయం పట్టేదని.. ఇప్పుడు వారు కేవలం 20 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చని వివరించింది.

READ MORE: Nandamuri Rama Krishna: రికార్డు ఓటింగ్.. తెలుగు జాతి మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!

బ్రిడ్జి విశేషాలను వివరిస్తూ.. సముద్రంపై 22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన అతి పొడవైన వంతెన ఇదేనని చెప్పింది. ‘ఎవరూ దాని గురించి ఆలోచించలేదు. ఇంజినీరింగ్‌లో ఇదో అద్భుతం. అద్భుతమైన మౌలిక సదుపాయాలను చూస్తే గర్వంగా అనిపిస్తుంది.” అచి వీడియోలో చెప్పారు. ఈ వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఆమె “దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు… పశ్చిమ భారతదేశం నుంచి తూర్పు భారతదేశం వరకు… ప్రజలను కలుపుతోంది. హృదయాలను కలుపుతోంది!” అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. రష్మిక పోస్ట్‌ను తన “ఎక్స్” ఖాతాలో పంచుకున్నారు. “ఖచ్చితంగా!” అని రాశారు. “ప్రజలను కనెక్ట్ చేయడం, జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు.” అని రాసుకొచ్చారు.