Site icon NTV Telugu

Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్‌డేట్ అదిరిపోయింది..!

Rashmika Mandanna Mysa Movie

Rashmika Mandanna Mysa Movie

శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రష్మిక మందన్న, ఇప్పుడు తనలోని అసలైన యాక్షన్ యాంగిల్‌ను బయటకు తీస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైసా’ చిత్రంలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె గత కొన్నాళ్లుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేశారు. అందుకోసం రష్మిక బ్యాంకాక్ వెళ్లి మరీ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యుద్ధ విద్యల్లో మెళకువలు నేర్చుకుంది. ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో సుమారు 15 రోజుల పాటు ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ జరగనుంది. కాగా రష్మిక మేకోవర్ గిరిజన యువతిగా చాలా రా (Raw) గా, ఇంటెన్స్‌గా ఉండబోతోందని సమాచారం.

ముఖ్యంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కేవలం డూప్‌లతో కాకుండా రష్మిక స్వయంగా చేస్తోందట. ఈ సీక్వెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అందుకే అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మనం ముందునుండి కూడా రష్మికను లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాల్లో ఎక్కువగా చూశాం. కానీ ‘మైసా’ ఆమెలోని నటిని కొత్తగా ఆవిష్కరించబోతోంది. కేరళ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్న ఈ గాఢతతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత రష్మిక నుంచి రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Exit mobile version