Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రష్మిక మందన్న, ఇప్పుడు తనలోని అసలైన యాక్షన్ యాంగిల్‌ను బయటకు తీస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైసా’ చిత్రంలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె గత కొన్నాళ్లుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, గూస్బంప్స్ తెప్పించేలా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేశారు. అందుకోసం రష్మిక బ్యాంకాక్ వెళ్లి మరీ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యుద్ధ విద్యల్లో మెళకువలు నేర్చుకుంది. ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో సుమారు 15 రోజుల పాటు ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ జరగనుంది. కాగా రష్మిక మేకోవర్ గిరిజన యువతిగా చాలా రా (Raw) గా, ఇంటెన్స్‌గా ఉండబోతోందని సమాచారం.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ముఖ్యంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కేవలం డూప్లతో కాకుండా రష్మిక స్వయంగా చేస్తోందట. ఈ సీక్వెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అందుకే అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మనం ముందునుండి కూడా రష్మికను లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాల్లో ఎక్కువగా చూశాం. కానీ ‘మైసా’ ఆమెలోని నటిని కొత్తగా ఆవిష్కరించబోతోంది. కేరళ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్న ఈ గాఢతతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత రష్మిక నుంచి రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!