NTV Telugu Site icon

Rashmika Mandanna : నేషనల్ క్రష్షా.. మజాకా..

Rashmi55

Rashmi55

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో బిజీగా గడుపుతుంది.. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది.. ఇప్పుడు మరో సినిమాలు ఓకే అయినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం రష్మిక ఏకంగా 6 సినిమాలను లైనప్ లో పెట్టుకుంది.. అందులో ఒక సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది..ఆ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం..

పుష్ప 2..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాతో రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా మారింది.. ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..

సికిందర్..

యానిమల్ తర్వాత హిందీలో రష్మిక మరో ఆఫర్ ను అందుకుంది.. బాలివుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో సికిందర్ సినిమా తెరకేక్కుతుంది.. ఆ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది..

కుబేర..

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో రాబోతున్న సినిమా కుబేర.. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు.. ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..

చవ్వ..

బాలీవుడ్ లో మరో సినిమాలో నటిస్తుంది… విక్కీ కౌశల్ జోడిగా నటిస్తుంది.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

వీటితో పాటుగా ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే సినిమాల్లో కూడా నటిస్తుంది.. మొత్తంగా చూసుకుంటే ఆరు సినిమాలతో బిజీగా ఉంది.. ఇంకా మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది..