Rashmika Mandanna took pictures with fans in Mumbai: ‘కిరిక్ పార్టి’ అనే కన్నడ చిత్రంతో రష్మిక మందన్న సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్స్ వచ్చాయి. గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. అందం, అభినయం ఉన్న రష్మిక.. తెలుగులో వరుస హిట్స్ కొడుతూ సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయ్యారు.
రష్మిక మందన్న నటించిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం అందుకోవడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక.. బాలీవుడ్‌లోనూ నటిస్తున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం కన్నడ సోయగం రష్మిక పుష్ప-2, యానిమల్, రెయిన్ బో చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఓ షూటింగ్ సందర్భంగా అభిమానులు చేసిన పనికి రష్మిక షాక్ అయ్యారు.
Also Read: North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
తాజాగా రష్మిక మందన్న ముంబైలో ఓ షూటింగ్ సెట్‌లో అభిమానులును కలిశారు. వారితో ముచ్చటించిన ఆమె.. అభిమానులతో ఫోటోలు దిగారు. ఫాన్స్ అందరూ రష్మికతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే ఓ అభిమాని అంతమంది మధ్య ఫోన్‌ను సరిగ్గా పట్టుకోలేకపోయాడు. దాంతో రష్మిక అతడి ఫోన్‌ను సరిచేసి ఫోటో దిగబోయారు. ఇంతలో మరో అభిమాని ఆ ఫోన్‌ను లాగేసుకున్నాడు. దాంతో కన్నడ సోయగం రష్మిక ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: IND vs WI: జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్ధం కావడం లేదు: హనుమ విహారి