నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది…
ఈసారి ఇంకా క్లియర్ డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.. గతంలో కన్నా ఇది డీప్ గా ఉంది..అందులో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖంను ఎడిట్ చేశారు. ఈ వీడియోపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో చేయవద్దు’ అని రష్మిక మందన్న అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు పోలీసుల ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..ఇలాంటి వాటిని ఆపాలని హెచ్చరిస్తున్నారు.. వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలేస్తున్న రష్మికకి ఇలాంటివి వరుసగా ఎదురు కావడం బాధాకరమనే చెప్పాలి. మరి వీటిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.. ఏది ఏమైన మరోసారి ఇలాంటి వీడియో బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు..
సినిమాల విషయానికొస్తే.. ఇటీవల యానిమల్ చిత్రంతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక మందన్నా. పుష్ప చిత్రంతోనే ఆమె పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ యానిమల్ చిత్రంతో దాన్ని మించిన ఇమేజ్‌ని క్రేజ్‌ని సొంతం చేసుకుంది.. అల్లు అర్జున్ పుష్ప2 లో నటిస్తుంది. మరో సారి శ్రీవల్లిగా సందడి చేయడానికి రెడీ అవుతుంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించింది. దీంతోపాటు రెయిన్ బో అనే సినిమా చేస్తుంది. అలాగే `యానిమల్ పార్క్`లోనూ పార్ట్ కాబోతుంది.. మొత్తానికి ఫుల్ బిజీ అయిపొయింది..