Rashmika : బాలీవుడ్ లో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ చిన్నది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కొట్టేసింది.ఇక పుష్ప2 విడుదల అయితే.. ఆమెకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలను అందుకుంటుంది రష్మిక. తెలుగులో రవితేజ హీరోగా.. రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కులు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాను హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది ఆ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు.
తెలుగులో విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ అయితే రాలేదు కాని.. హిందీలో మాత్రం భారీస్థాయిలో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటించనుండగా ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాలో రష్మిక మందన్నను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.ప్రభుదేవ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ దాదాపు గా మంచి విజయం సాధించాయి.ఈ సినిమా కూడా పక్కా పధకం తో ఆయన తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈసినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!