బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. హాట్ అందాల విందు చేస్తూనే వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది..తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది..
ఈ అమ్మడు తాజాగా వదిలిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టించాయి..మొన్న అనసూయ బికినీ ఫోటోలను వదిలితే నిన్న రష్మీ ఎద అందాలను బహిర్గతం చేస్తూ ఫుల్ షో చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి.. ఇది ఇలా ఉండగా.. యాంకర్ రష్మీ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది.. రష్మికు ఓ బంఫర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.. అదేంటంటే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొనబోతుంది..బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చిందని.. అయితే రెమ్యూనరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఈ సారి హోస్ట్‌గా రానా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గోనేందుకు రష్మి గౌతమ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్త షికారు చేస్తుంది..
మామూలుగా రష్మి గౌతమ్ ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. దీంతో దీనికి తగ్గట్లుగా పారితోషికం కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో షో నిర్వాహకులు కాస్త ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయినా ఈ అమ్మడు మాత్రం తగ్గేదే లేదు అంటుందంట. ఆఖరికి మరి రష్మికి బిగ్‌బాస్‌లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.. రష్మీ హౌస్ లో ఉంటే యూత్ ను ఆకట్టుకుంటుందని యాజమాన్యం ఆమె అడిగినంత ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఈ అమ్మడు యాంకరింగ్ చేస్తునే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది..