అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో 200కు పైగా వికెట్లు తీసిన తొలి అఫ్గాన్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్స్ పడగొట్టడంతో రషీద్ ఖాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు 27 ఏళ్ల ఈ స్పిన్నర్‌కు ఒక వికెట్ అవసరం అయింది. 39వ ఓవర్ చివరి బంతికి మెహిదీ హసన్ మిరాజ్‌ను అవుట్ చేయడంతో 200 వికెట్స్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు.
రషీద్ ఖాన్ 115 మ్యాచుల్లోనే 200 వికెట్స్ పడగొట్టాడు. ఈ జాబితాలో మహ్మద్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. నబీ 174 మ్యాచుల్లో 176 వికెట్లు తీశాడు. దవ్లత్ జాద్రాన్ (115), ముజీబ్ ఉర్ రెహమాన్ (101), గుల్బాదిన్ నాయిబ్ (74) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రషీద్ 107వ వన్డే ఇన్నింగ్స్‌లో తన 200వ వికెట్‌ను పడగొట్టాడు. మిచెల్ మార్ష్, మహమ్మద్ షమీ, సక్లైన్ ముష్తాక్ మాత్రమే రషీద్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 200 మంది బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేశారు.
Also Read: Niharika NM:సినిమాల్లో నటించడం నాకు కొత్త.. చాలా ఎంజాయ్ చేశా!
రషీద్ ఖాన్ మరో రేర్ రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 200 ప్లస్ వికెట్లు, టీ20ల్లో 150 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక ఆసియా బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 179 వికెట్లు తీశాడు. ఆసియా క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రికార్డును ఎవరూ అందుకోలేదు. రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో 150 ప్లస్ (158) వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రషీద్ ఎంత ప్రమాదకారో ఇట్టే అర్ధమవుతోంది. రషీద్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
