Site icon NTV Telugu

Rasha Thadani: ఘట్టమనేని వారసుడి పక్కన రవీనా టాండన్ కూతురు..!

Rasha Thadani

Rasha Thadani

Rasha Thadani: సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు “శ్రీనివాసమంగాపురం” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మాత్రం టైటిల్ ప్రకటించలేదు. ఈ సినిమాతో ఒకప్పటి అందాల భామ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఇది ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఈ సినిమాను తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరిస్తున్నారు.

Ibomma: మీ దేశంలో పర్మనెంట్ గా మూసేస్తున్నాం.. ఐబొమ్మ మెసేజ్!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి, తర్వాత చేసిన సినిమాల వల్ల కూడా “రగ్గడ్ డైరెక్టర్” అనే పేరును తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తుండగా, అశ్విని దత్ సమర్పిస్తున్నారు.

Pawan Kalyan : పవన్ కోసం వక్కంతం వంశీ కథలు?

రవీనా టాండన్ మరియు అనిల్ తడానీ కుమార్తె రాషా ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన “ఉయ్యమ్మ” సాంగ్ విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version