Site icon NTV Telugu

Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..

Police Station

Police Station

Rash Car Driving in Tandoor: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను మైనర్ బాలుడు ఢీకొట్టాడు. తాండూర్ పట్టణంలో ఘటన చోటు చేసుకుంది. పట్టణనంలోని సాయిపూర్ కి చెందిన మోయిన్ పాషా ఫిర్యాదు మేరకు తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం రాత్రి సమయంలో తెల్లవారుజామున మోయిన్ పాషా ఇంటి ముందర పార్క్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. దాంతో ధ్వంసమైన ద్విచక్ర వాహనాలు పెద్ద శబ్దం రావడంతో నిద్ర లేచి చూసాడు మోయిన్ పాషా. పట్టణానికి చెందిన Ap 29 BD 7777 కారుని మైనర్ బాలుడు నడుపుతున్నట్టుగా పట్టణ సీఐ జి సంతోష్ కుమార్ తెలిపారు. కారులో మరో ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.

Rahul Gandhi: వయనాడ్‌ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

కేసును ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరైనా మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లైతే వాహన ఓనర్ పై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతాయని సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.

Exit mobile version