Site icon NTV Telugu

Rasamalai: ప్రపంచ అత్యుత్తమ డెజర్ట్ లలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ‘రసమలై’…!

6 Rasa

6 Rasa

ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతలతో పాటు.. వంటకాలకు కూడా మంచి పేరు ఉంది. ఇకపోతే ఉత్తర భారత దేశంలో ఉన్న వారు కాస్త స్వీట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని చెప్పవచ్చు. ఎటువంటి పండుగ వచ్చిన అక్కడివారు ఎక్కువగా స్వీట్లు చేసుకుంటూ పండగను ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఆహార మార్గదర్శి విషయంలో ముందుండే.. టేస్ట్ అట్లాస్ కంపెనీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ ఉత్తమ చీజ్ డెసర్ట్ ల జాబితాను విడుదల చేసింది.

Also read: Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో భారీగా బంగారం ప‌ట్టివేత‌..

ఇందులో భారతదేశానికి చెందిన స్వీట్ కూడా స్థానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యం చెందిన వాటిలో రసమలై రెండో స్థానంలో నిలవడం నిజంగా గమనార్హం. ఈ లిస్టులో పోలాండ్ దేశానికి చెందిన సెర్నిక్ మొదటి స్థానం సంపాదించగా.. రసమలై కు రెండో స్థానం దక్కింది.

Hyderabad: చిన్నారిపై కుక్కల దాడి.. పరిస్థితి విషమం
Also read:

ఈ రసమలై స్వీట్ ఎక్కువగా బెంగాల్ ప్రాంతంలో తయారు చేస్తారు. అక్కడ ప్రజలు చాలామంది ఈ స్వీట్ తయారు చేసి జీవనోపాధి కూడా పొందుతున్నారు. ఈ లిస్టులో మొదటి స్థానం పొందిన సెర్నిక్ 5 కు 4.5 రేటింగ్ సంపాదించిగా రసమలై 5 కు 4.4 రేటింగ్ సాధించింది.,

Exit mobile version