Site icon NTV Telugu

Mahabubabad: అరుదైన ఘటన.. సర్పంచ్‌గా పోటీ చేయాలని మహిళ కాళ్లపై పడి వేడుకున్న గ్రామస్తులు..!

Viral Video

Viral Video

Mahabubabad: రాష్ట్రంలో వెలుబడిన పంచాయితీ ఏన్నికల నోటిఫికేషన్ తో గ్రామాల్లో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది. ఇందులో భాగంగా రోజుకొక కొత్త సమాసం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే తాజగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ విచిత్రమైన, భావోద్వేగపూరిత దృశ్యం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ మహిళ కాళ్లపై పడి ఆమెను ఓటు కోసం కోరుతున్నట్లు కనిపించినా… అసలు విషయం మాత్రం పూర్తిగా వేరే. గ్రామ పంచాయతి ఎన్నికల్లో భాగంగా ఈసారి దాట్ల గ్రామానికి జనరల్ మహిళ కేటగిరీలో సర్పంచ్ పదవి కేటాయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తమ గ్రామానికి మంచి నేతగా నిలదొక్కుకునేలా రాములమ్మను సర్పంచ్‌గా పోటీ చేయాలని కోరుతున్నారు.

Cars Launches in December: భారత రోడ్లపైకి రాబోతున్న కొత్త కార్లు ఇవే.. లిస్ట్ పెద్దదే సుమీ..!

అయితే ఇక్కడ సమస్య ఏమి ఏమిటంటే.. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడి భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండడంతో, ఆమెకు పోటీ చేసే హక్కు లేదు. దీంతో ఆ మాజీ ఎంపీటీసీ సభ్యుడి అమ్మ రాములమ్మకు ఎన్నిసార్లు చెప్పినా, కొడుకు ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. దీనితో చివరకు గ్రామ కార్యకర్తలు, స్థానికులు కలిసి రాములమ్మ ఇంటికి వెళ్లి.. ఆమె కాళ్లపై పడి, గ్రామం కోసం అయినా సర్పంచ్‌గా పోటీ చేయమని వేడుకున్నారు. అయినా కానీ ఆమె ఎంతగా నిరాకరించినా, గ్రామస్తుల పట్టు వదలలేదు. చివరకు రాములమ్మ ఎన్నికల బరిలో నిలబడేందుకు అంగీకరించినట్లు సమాచారం.

Internal Conflict In Team India: టీమిండియాలో అంతర్గత పోరు.. గంభీర్, కోహ్లీ, రోహిత్ మధ్యే..?

ఈ మొత్తం ఘటనను అక్కడ ఉన్న వారు వీడియోగా రికార్డ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. మహిళ కాళ్లపై పడి పడే ఆ దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. గ్రామ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Exit mobile version