Site icon NTV Telugu

RapidActionMission: ఓటీటీలోకి వచ్చేసిన దేశభక్తి చిత్రం..

Rapid Action Mission

Rapid Action Mission

రాపిడ్ యాక్షన్ మిషన్ ( RAM ) ఓ దేశభక్తి చిత్రం. ఈ సంవత్సరం సినిమాను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి విడుదల చేసారు. దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రంలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా తెరంగేట్రం చేయగా., ధన్య బాలకృష్ణ కథానాయిక. దీపికా ఎంటర్‌టైన్‌మెంట్, OSM విజన్‌ తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. దర్శకుడిగా మిహిరామ్ వినతేయ తన మొదటి చేసిన తన పనితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు.

Also Read: Road Accident: మీర్జాపూర్ నటుడి ఇంట తీవ్ర విషాదం..

తొలి సినిమానే అయినా రామ్ ( రాపిడ్ యాక్షన్ మిషన్ ) హీరోకి, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. థియేటర్‌ లో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు కనిపించిన కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేకపోయింది. దేశభక్తి గురించిన చిత్రమే అయినప్పటికీ ఇందులో పొందుపరిచిన అన్ని రకాల ఎలిమెంట్స్, ఎమోషన్స్ అందించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సంగీతం, ఆర్ఆర్, కెమెరా పనితనం ఇలా అన్ని డిపార్మెంట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమా.

Also Read: DC vs SRH: బౌలింగ్ చేయాలంటే బయమేసింది: ప్యాట్ కమిన్స్

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతోంది. దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఇక సినిమా థియేటర్లలో మిస్సైన వారందరూ ఇప్పుడు ఇంటిల్లిపాదు ప్రైమ్‌ లో చూసి ఆనందించవచ్చు.

Exit mobile version