ఓ బాలికను రేప్ చేసి జైలుకెళ్లిన కామాంధుడు.. జైలు శిక్ష అనుభవించి విడుదలై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం సత్నా జిల్లాలో మరో మైనర్ బాలికను రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సాత్నాలోని కృష్ణా నగర్‌కు చెందిన రాకేష్ వర్మ (35)గా గుర్తించారు. బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం రేవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
Renu Desai: అలా చేయద్దు అనడానికి నువ్వెవరు?.. రేణు దేశాయ్ మరో సంచలనం
ఈ ఘటనపై సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP) మహేంద్ర సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాల క్రితం నిందితుడు వర్మ జిల్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. దీంతో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే అతను ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాడని.. మిగిలిన మూడేళ్ల జైలు శిక్షను జైలులో మంచి ప్రవర్తన వల్ల విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అలాంటి ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు పేర్కొన్నారు.
50,000 Jobs: ఉద్యోగాల జాతర.. ఈ ఏడాది 50 వేల కొత్త కొలువులు..!
నిందితుడు రాకేశ్ వర్మ.. జగత్‌దేవ్ తలాబ్ ప్రాంతం నుండి బాలికను తీసుకెళ్లాడని.. అయితే కుటుంబ సభ్యులు తమకు సమాచారం అందించగా బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో.. నిందితుడు ఆమేపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
