సోమవారం ఆర్థిక రాజధాని ముంబై గాలి తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. 76 మంది గాయాలు పాలయ్యారు. క్షతగాత్రలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఊహించని పరిణామంలో అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఇది కూడా చదవండి: Yellow Urine Reasons: ఈ కారణాల వల్ల మూత్రం పసుపు రంగులోకి మారవచ్చు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి!
ఈ ఘటనలో ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అయితే అతడి గురించి ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్‌లు పెట్టినందుకు ఇప్పటికే భవేశ్‌పై 20కి పైగా జరిమానా పడినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో అతడిపై ఒక అత్యాచారం కేసు కూడా నమోదైంది. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు. అది తప్పుడు కేసు అని అతడి తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!
ఇక ఘాట్కోపర్ ప్రాంతంలో కూలిన హోర్డింగ్ కోసం ఎలాంటి ముందస్తు అనుమతి లేదని బృహన్ ముంబయి మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ హోర్డింగ్ అనుమతించిన గరిష్ఠ పరిమాణం కన్నా తొమ్మిది రెట్లు పెద్దదని చెప్పారు. సోమవారం రాత్రి ములుంద్ ప్రాంతంలోని భవేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా అతడి జాడ కనిపించలేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. భవేశ్ తన కుటుంబంతో కలిసి దేశం దాటాడని, కానీ ముంబై పోలీసులు మాత్రం అతడిని పట్టుకోవడానికి కష్టపడుతున్నారని ఓ బీజేపీ నేత ఎద్దేవా చేశారు.
ఇక హోర్డింగ్ కూలిన ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక ముప్పు పొంచి హోర్డింగ్‌లు తొలగించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Nani: అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘సరిపోదా శనివారం’ క్లైమాక్స్