Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధురంధర్2 రిలీజై నెల రోజులౌతున్నా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తూనే ఉంద. నియర్లీ 1800 కోట్లకు చేరువలో ఉన్న ఈ ఫిల్మ్ పుష్ప2, బాహుబలి2 రికార్డ్స్ గల్లంతు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విజయం రణవీర్‌లో చాలానే మార్పులు తెచ్చింది. తను తెలిసో తెలియకో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో కన్నడిగులతో నెలకొన్న వివాదాన్ని క్లోజ్ చేశాడు రణవీర్. గోవాలో ఇటీవల జరిగిన ఇఫీ వేడుకల్లో రిషబ్ శెట్టిని ప్రశంసించే క్రమంలో పంజర్లీ దేవతను దెయ్యం అని సంబోధించడంతో కన్నడ ఇండస్ట్రీ భగ్గుమంది.
రిషబ్ కూడా రణవీర్ అలా అనడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. చివరకు రణవీర్ క్షమాపణలు చెప్పినా సమస్య కోర్టుకు చేరింది. కానీ బేషరుతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధం కావడంతో సమస్య క్లోజ్ అయ్యింది. అలాగే ధురంధర్ తర్వాత ఫర్హాన్ అక్తర్‌తో డాన్3 కి కమిటయ్యాడు రణవీర్. కానీ ధురంధర్ తర్వాత వెంటనే మరో మాస్ మూవీలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపని బాలీవుడ్ హీరో.. ప్రాజెక్ట్ నుండి క్విట్టయ్యాడు. దీనిపై ఫర్హాన్, రణవీర్ మధ్య వివాదం నెలకొంది. ఈ విషయాన్ని పెద్దది చేయకూడదనుకున్న హీరో.. 10 కోట్లు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్ సెటిల్ చేసేశాడు హీరో. అయితే రణవీర్ కాబట్టి వెనక్కు తగ్గాడని.. అదే దీపికాతో పెట్టుకుంటేనా..తన తప్పు ఉన్నా రివేంజ్ ప్లాన్ చేసేదని, లేదంటే పీఆర్ స్టంట్స్ చేయించేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రణవీర్ నెక్ట్స్ జాంబిస్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. స్కామ్ 1992 అసిస్టెంట్ డైరెక్టర్, లూటేరే సిరీస్ తెరకెక్కించిన జై మెహతా ఈ సినిమాను దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రళయ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. లోకతో పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణి ప్రియదర్శన్..ఈ ధురంధరుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. జులై లేదా ఆగస్టు నుండి మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని బీటౌన్ టాక్.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!