Cheteshwar Pujara becomes fourth Indian to complete 20000 first-class runs: టీమిండియా ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, వన్డేలు.. దేశవాలీ టోర్నీలు కలిపి 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. మొత్తంగా 260 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల పుజారా.. 61 శతకాలు, 77 అర్ధ శతకాలు చేశాడు.
విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న చతేశ్వర్ పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసే క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయిని దాటాడు. పుజారాకు ముందు సునీల్ గవాస్కర్ (25,834), సచిన్ టెండూల్కర్ (25,396), రాహుల్ ద్రవిడ్ (23,794) మాత్రమే భారత్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 20000 పరుగుల మార్కును అందుకున్నారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హాబ్స్ పేరిట ఉంది. హాబ్స్ 1905-34 మధ్యలో 61,760 పరుగులు చేశాడు.
Cheteshwar Pujara has completed 20,000 First-Class runs. pic.twitter.com/MzhwsOOajU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024