ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2022 మార్చ్ ఒకటో తేదీన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలనే రియల్టర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. ఇబ్రహీంపట్నంలోని కర్ణగూడ వద్ద ఉన్న పరికరాల ల్యాండ్ వివాదమే వీరి హత్యకు కారణంగా దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు. మట్టారెడ్డి నవీన్ లతో పాటు మరో ముగ్గురు కలిసి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను చంపినట్లుగా గుర్తించారు. పక్కా ఆధారాలను కోర్టులో పోలీసులు సబ్మిట్ చేశారు. దీంతో మట్టారెడ్డి, ఖాజా మొయినుద్దీన్, బిక్షపతిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
Read Also: Horse Gram Cultivation: ఉలవ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆరోజు జరిగిన సంఘటనను మృతుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కృష్ణ, షరీఫ్ లు వివరించారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను చంపిన తరువాత మా ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేశారు.. మేమే చంపామని పోలీసులు విచారించారు.. మట్టారెడ్డి ఆ రోజు స్పాట్ లోనే ఉన్నాడు.. ఎందుకు చంపావని నిలదీశాము.. కానీ, తనకేమి తెలియదని మట్టారెడ్డి చెప్పాడు.. పోలీసులకు మట్టారెడ్డే చంపాడని చెప్పాము.. మొత్తానికి దర్యాప్తులో పోలీసులు సాక్ష్యాధారాలతో సహా మట్టారెడ్డి మరో ఇద్దర పై కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పోలీసులకు రుణపడి ఉన్నాము అని మృతుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కృష్ణ, షరీఫ్ లు అన్నారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈ కేసు తీర్పుతో అందరికి తెలిసింది మృతుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కృష్ణ, షరీఫ్ లు తెలిపారు. నిందితులకు శిక్ష పడటం ఆనందంగా ఉందన్నారు.