NTV Telugu Site icon

Vaishnav Tej: నెగిటివ్ రోల్‌లో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నా

Ranga Ranga Vaibhavanga1

Ranga Ranga Vaibhavanga1

పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ మేరకు శనివారం నాడు చిత్ర యూనిట్ సభ్యులు ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ చేరుకుని సందడి చేశారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. రంగ రంగ వైభవంగా మూవీని అందరూ చూడాలని కోరుతున్నానని.. ఈ మూవీని థియేటర్‌లోనే చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే తాను లేనని వైష్ణవ్ తేజ్ స్పష్టం చేశాడు. నెగిటిల్ రోల్ అవకాశం వచ్చినా తాను సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తనకు ఆర్మీ రోల్ చేయడం అంటే చాలా ఇష్టమని.. అవకాశం వస్తే చేస్తానని పేర్కొన్నాడు.

కాగా రంగ రంగ వైభవంగా సినిమాను ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజే విడుదలవుతున్న ఈ మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి.

Show comments