NTV Telugu Site icon

Ranchi Test: కేఎల్ రాహుల్‌ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు! యశస్వి డౌటే

Kl Rahul Test

Kl Rahul Test

Rajat Patidar Likely to Drop in Ranchi Test for KL Rahul: రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఇంగ్లండ్‌ మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. రెండు వరుస విజయాలు సాదించిన భారత్.. రాంచీలో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే టీమిండియా కూర్పులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రజత్‌ పటీదార్‌పై వేటు పడే అవకాశం ఉంది.

మొదటి టెస్టులో గాయపడిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌.. ఫిట్‌నెస్‌ కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. రాహుల్ రాంచీ టెస్ట్ మ్యాచ్‌లో ఆడుతాడు. దాంతో గత రెండు టెస్టుల్లోనూ విఫలమైన రజత్‌ పటీదార్‌పై వేటు పడుతుంది. ఎందుకంటే పటీదార్‌ రెండు టెస్టుల్లో కలిపి 46 పరుగులు మాత్రమే చేశాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న అతడు పేలవ షాట్ ఆడి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (డబుల్‌ సెంచరీ), సర్ఫరాజ్‌ ఖాన్ (హాఫ్‌ సెంచరీ)లు అద్భుతంగా ఆడిన ఇదే పిచ్‌పై పటీదార్‌ ఇబ్బంది పడటం గమనార్హం.

Also Read: Chiranjeevi: లాస్ ఏంజిల్స్‌లో ‘మెగాస్టార్’ చిరంజీవికి ఘన సన్మానం!

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్‌ రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాక వెన్ను నొప్పితో మైదానం వీడిన అతడు.. తర్వాతి రోజు వచ్చి డబుల్‌ సెంచరీ చేశాడు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌ ఫీల్డింగ్‌ సమయంలో జైస్వాల్‌ అసౌకర్యంగా కనిపించాడు. వెన్ను పట్టుకుని పనిపించాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చి.. చివరి టెస్టుకల్లా ఫిట్‌గా ఉంచేలా మేనేజ్‌మెంట్‌ ప్రయత్నాల చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ జైస్వాల్‌కు విశ్రాంతిని ఇస్తే.. ఓపెనర్‌గా దేవదత్‌ పడిక్కల్‌ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ రజత్‌ పటీదార్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వాలనుకుంటే.. గిల్ ఓపెనర్‌గా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి.