Site icon NTV Telugu

Ranbir Kapoor: కూతురికి కోట్ల విలువైన బంగ్లాను గిఫ్ట్ గా ఇవ్వనున్న రణబీర్..

Alia Bhatt

Alia Bhatt

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అలియాభట్ రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. వీరిద్దరి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా రీసెంట్ గా ఒకపాప పుట్టింది.. ఆ పాపకు రాహా కపూర్ అని పేరు పెట్టారు.. ఆ పాపకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. రణబీర్ కపూర్, అలియా భట్ మరియు నీతూ కపూర్ ఇటీవల ముంబైలోని బాంద్రా నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న వారి బంగ్లాలో కలిసి కనిపించారు.. అయితే ఆ కోట్లు విలువైన బంగ్లాను తమ కూతురు రాహా పేరు మీద పెట్టబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ వార్త నిజమైతే అతి చిన్న వయస్సులో రిచ్ స్టార్ కిడ్ గా రాహా నిలుస్తుంది..

ఈ బంగ్లా ఖరీదు దాదాపుగా రూ.250 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తుంది.. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఉన్న స్టార్స్ ఇళ్ల కన్న అత్యంత ఖరీదైన’ సెలబ్రిటీ బంగ్లా ఇదే అని నివేదికలు పేర్కొన్నాయి. అలియాభట్, రణబీర్లకు ఈ ఖరీదైన బంగ్లాతో పాటుగా నాలుగు లగ్జరీ ఇల్లు ఉన్నాయని సమాచారం.. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..

Exit mobile version