Site icon NTV Telugu

Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

Ramayana, Ranbeer Kapoor

Ramayana, Ranbeer Kapoor

దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ్’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘రామ గ్లింప్స్’ నెట్టింట రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా ఈ సినిమా నిడివి (Run-time) గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా రన్‌టైమ్ గురించి లీక్ చేసేశారు.

Also Read : Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ.. ‘రామాయణం అనేది ఒక మహా కావ్యం. దీనిని ఏమాత్రం కుదించకుండా, ప్రతి కీలక ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు దాదాపు 6 గంటల ఎపిక్ విజువల్స్‌తో ఈ సినిమా రాబోతోంది’ అని రణ్‌బీర్ పేర్కొన్నారు. అయితే ఈ 6 గంటల నిడివి అనేది ఒకే భాగానికి సంబంధించిందా లేక రెండు భాగాల మొత్తం సమయమా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఒక్కో భాగం 3 గంటల చొప్పున ఉన్నా, అది ప్రేక్షకులకు ఒక గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. నమిత్ మల్హోత్రా దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు) వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇంత సుదీర్ఘమైన రన్‌టైమ్‌తో రామాయణాన్ని వెండితెరపై చూపించడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Exit mobile version