NTV Telugu Site icon

Ranbir kapoor : అలియాభట్ చెప్పులు మోసిన రణబీర్ కపూర్

Alia

Alia

Ranbir kapoor : ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నిండుకుంది. ఆయన తల్లి పమేలా చోప్రా శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆదిత్య చోప్రా ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. రణబీర్ కపూర్, అలియాభట్ సాయంత్రం ఆలస్యంగా తన ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రణబీర్ కపూర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Read Also : Tollywood : ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కు పెరుగుతున్న క్రేజ్‌.. ఈవీ కార్లు కొంటున్న సినీ హీరోలు

శుక్రవారం సాయంత్రం రణబీర్ కపూర్, అలియా భట్ ఆదిత్య చోప్రా ఇంటికి వెళుతున్నప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయబడింది. రణబీర్, అలియా క్యాజువల్ లుక్‌లో ఉన్నారు. అలియా లుక్ కూడా చాలా సింపుల్‌గా కనిపించింది. రణబీర్-అలియా ఒకరి వెనుక ఒకరు వెళ్లడం కనిపిస్తుంది. ఈ సమయంలోనే రణబీర్ ఆలియా చెప్పులను ఎత్తుకుని వెళ్లడం రికార్డయింది. దీనిపై రణబీర్ ట్రోల్స్ కు గురవుతున్నారు. వీడియోలో.. అలియా రణబీర్ ముందు నడుస్తూ కనిపించింది. ఆమె మొదట ఇంట్లోకి ప్రవేశించే ముందు బయట మెట్ల దగ్గర తన చెప్పులు వదిలేస్తుంది. వెనకే వచ్చిన రణబీర్ ఆమె చెప్పులు తీసి లోపల పెడతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రణబీర్ కపూర్‌పై మండిపడ్డారు. గుడి ముందు రణబీర్ చెప్పులు పెట్టుకున్నాడని అంటున్నారు. అతను ఇలా చేసి ఉండకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు.