టాలివుడ్ నటుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఈయన నటించిన విరాట పర్వం గత ఏడాది విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. కానీ మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే రానాకు భారీ విజయాన్ని అందించాయి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన `భీమ్లా నాయక్` మాత్రం సూపర్ హిట్ అయింది. మొన్నామధ్య రానా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో పలకరించారు. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ లో వెంకటేస్ రానా తండ్రి పాత్రను పోషించాడు.
అయితే స్ట్రీమింగ్ అయిన క్షణం నుంచి ఈ వెబ్ సిరీస్ పై ఎన్ని విమర్శలు వచ్చాయో అంతే లేదు. కానీ, విమర్శలతోనూ భారీ వ్యూస్ అందుకుని రానా నాయుడు రికార్డులు తిరగేసింది. ఇకపోతే తాజాగా రానా `స్పై` మూవీలో మెరిశాడు. ఈ సినిమాతో ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ జంటగా నటించారు. ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, సాన్య ఠాకూర్, మకరంద్ దేష్పాండే, రానా దగ్గుబాటి తదితరులు ముఖ్య పాత్రల్లో పోషించారు.. ఒక్క ట్రైలర్ తోనే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. సినిమా హిట్ అవుతుందనే మేకర్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు..
అయితే ఆ అంచనాలను అందుకోవడంతో స్పై విఫయం అయింది. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. స్పైస్ లేని స్పై థ్రిల్లర్ అని మూవీ క్రిటిక్స్ తేల్చేశారు. అయితే ఈ సినిమాలో రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో కనిపించాడు. అతడి పాత్ర సినిమా లాస్ట్ లో వస్తుంది..ఇక క్లైమాక్స్‌లో రానా ఎంటరై సుభాష్ చంద్రబోస్ మరణం గురించి ఏదో థియరీ లాంటిది చెబుతాడు. ఆయన పాత్ర నిడివి కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండదు. అయినాసరే స్పై మూవీ కోసం రానా ఏకంగా రూ. 40 లక్షలు ఛార్జ్ చేశాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నాడు.. నిమిషం కూడా లేని ఆ సీన్ కోసం అన్ని లక్షలు తీసుకున్నావా… నువ్వు మొదలెట్టేశావుగా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు..
