NTV Telugu Site icon

Rana : భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకుని వస్తున్న రానా

New Project (11)

New Project (11)

Rana : రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు తన నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎంతటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడకుండా చేస్తుంటాడు. అందుకే మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలను తన ద్వారా వైడ్ రిలీజ్ కు అవకాశం కల్పిస్తున్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా రానా తన మార్క్ చాటుకుంటున్నాడు. ఐతే రానా తీసే సినిమాల విషయంలో మాత్రం చాలా గ్యాప్ వస్తుంది. విరాటపర్వం తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. నిఖిల్ సినిమాలో ఏదో ఒక క్యామియో రోల్ చేశాడంటే. ఏదో ఒక సినిమా చేసేద్దామని కాదు సినిమా చేస్తే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని అంటున్నాడు రానా. ఇటీవల ది రానా దగ్గుబాటి షో అంటూ ప్రైమ్ వీడియో లో స్పెషల్ ప్రోగ్రాం కి హోస్ట్ గా మరో సారి మారిపోయారు. అందులోనే తన సినిమాల గ్యాప్ కు రీజన్ కూడా చెప్పుకొచ్చారు. అసలైతే ఈ పాటికి తేజాతో రాక్షస రాజు సినిమా చేయాల్సి ఉంది. తేజాతో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసిన రానా.. రాక్షస రాజు కథ కూడా దానికి దగ్గరగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ కాదనుకున్నామని అన్నారు రానా.

Read Also:Astrology: డిసెంబర్ 4, బుధవారం దినఫలాలు

అంతేకాదు హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ కూడా ప్రొడక్షన్ దశలో ఉందని అన్నారు. ఐతే మైథలాజికల్ సినిమాలు చేయాలంటే కాస్త టైం పడుతుందని అందుకే ఆ సినిమా లేట్ అవుతుందన్నారు. త్రివిక్రమ్ పర్యవేక్షణలో హిరణ్య కశ్యప సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది. ఐతే ఆ ప్రాజెక్ట్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు. బాహుబలి లో భళ్లాలదేవ పాత్ర తర్వాత మళ్లీ ఆ రేంజ్ ఇంపాక్ట్ కలిగించేలా రానా ఏ సినిమాలో నటించలేదు. ఐతే హిరణ్య కశ్యపతో పెద్ద టార్గెట్ పెట్టుకున్న రానా ఆ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. రానా చేస్తున్న ది రానా దగ్గుబాటి షోలో సెలబ్రిటీస్ తో రానా చిట్ చాట్ క్రేజీగా ఉంటున్నాయి. కేవలం తెలుగు సెలబ్రిటీస్ ని మాత్రమే కాదు అన్ని సినీ పరిశ్రమలకు సంబంధించిన వారితో రానా చిట్ చాట్ చేస్తున్నాడు. రానా వెంకటేష్ చేస్తున్న రానా నాయుడు వెబ్ సీరీస్ కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. తెలుగులో ఏమో కానీ రానాకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అక్కడ స్ట్రైట్ సినిమాలు చేసే అవకాశం ఉన్నా రానా ఎందుకో ఆ ప్రయత్నాలు చేయట్లేదు.

Read Also:Off The Record: అక్కడి వైసీపీ నేతలకు చెమటలు..? అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్..!

Show comments