Ramya Krishna : తెల్లవారితే పెళ్లి.. కానీ రాత్రి 2 గంటల వరకు షూటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రమ్యకృష్ణ నాలుగు దశాబ్దాలుగా ‘క్వీన్’లా వెలిగిపోతున్నారంటే దానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు, అంతులేని డెడికేషన్ కూడా. ‘భలే మిత్రులు’తో ప్రేక్షకులకు పరిచయమై.. 80ల చివర నుంచి 90ల వరకు స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటి టాప్ హీరోలతో నటించి స్టార్‌డమ్ అందుకుంది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి చెప్పిన విషయం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
2003లో రమ్యకృష్ణ గారు డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తెల్లవారితే తన పెళ్లి అనగా.. ఆ ముందు రోజు రాత్రి వరకు ఆమె షూటింగ్‌లోనే ఉన్నారట! ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘సింహాద్రి’ సినిమాలో “చిన్నదమ్మే చీకులు కావాలా” అనే స్పెషల్ సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఆ పాట షూటింగ్ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ చేయడంతో, వేరే దారి లేక రమ్యకృష్ణ గారు రాత్రంతా డ్యాన్స్ చేశారట..‘తెల్లవారితే నా పెళ్లి.. కానీ రాత్రి 2 గంటల వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాను. ఆ డ్యాన్స్ పూర్తయ్యాక అక్కడి నుంచి నేరుగా పెళ్లి మండపానికి వెళ్లాను’ అని రమ్యకృష్ణ చెప్పడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సాధారణంగా పెళ్లి అంటే వారం రోజుల ముందు నుంచే బ్రేక్ తీసుకుంటారు, కానీ పనికి ఆమె ఇచ్చిన గౌరవం చూసి నెటిజన్లు ‘స్టార్ అంటే ఇలా ఉండాలి’ అని పొగిడేస్తున్నారు. అందుకేనేమో, ఇప్పటికీ ఆమెకు సాటి వచ్చే నటి టాలీవుడ్‌లో మరొకరు లేరు. పెళ్లి పీటల మీద కూడా ఆ గ్లో తగ్గకుండా ఆమె ఎలా మేనేజ్ చేశారో అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read
- Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
- Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
తాజావార్తలు
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
-
Delhi Building Collapse: “రక్షించండి”.. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!