NTV Telugu Site icon

Rammohan Naidu: ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్‌గా రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu

Rammohan Naidu

Rammohan Naidu: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఇందులో ఏపీఎంసీ ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సింగపూర్ దేశం ప్రతిపాదించగా భూటాన్ దేశం మద్దతుతో ఆయా దేశాల ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Read Also: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న పడవల తొలగింపు ప్రక్రియ

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు సభ్య దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఆకాశ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Show comments