యోగా గురు రామ్ దేవ్ బాబా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అందరికీ ఈయన గురించి తెలుసు.. యోగా మాత్రమే కాదు పలు బిజినెస్ లు కూడా చేస్తుంటారు.. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తుంటారు.. ఇప్పుడు మరో న్యూస్ వార్తల్లో హైలెట్ అవుతుంది.. న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈయన మైనపు బొమ్మను పెట్టినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
చాలా మంది ఇక్కడ బొమ్మలు ఉంటే ఏదో సాధించిన ఫీలింగ్ లో ఉంటారు.. ఇప్పటికే అక్కడ ఎంతోమంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి.. మహాత్మగాంధీ నుంచి మొదలుపెట్టి ఇందిర, మన్మోహన్‌సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు రాజకీయ నాయకీయ నాయకులకు దక్కింది.. అలాగే స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్,టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్ లతోపాటు మరికొందరి మైనపు బొమ్మలు కూడా అక్కడ ఉన్నాయి.. ఇప్పుడు రామ్ దేవ్ బాబాకు ఆ గౌరవం దక్కింది..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో బాబా రామ్‌దేవ్ మైనపు బొమ్మ ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇలాంటి గౌరవం పొందిన తొలి భారతీయ గురువుగా (సన్యాసిగా) గురూజీ కి గుర్తింపు దక్కింది.. వృక్షాసన ముద్రలో రామ్‌దేవ్ మైనపు విగ్రహం కనిపించనుంది. ఈయన మైనపు విగ్రహాన్ని న్యూయార్క్‌తోపాటు ఢిల్లీ మ్యూజియంలో కూడా ఈ విగ్రహాలను ఉంచనున్నారని తెలుస్తుంది..