NTV Telugu Site icon

Ramcharan : ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ..?

Ramcharan

Ramcharan

Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో హీరో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో నటించనున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్  మొదలు పెట్టాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడు.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేసున్నాడు.రాంచరణ్ 16 వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు.

Read Also :NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..

ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రాంచరణ్ ఓ చేయనున్నాడని తెలుస్తుంది.దర్శకుడు వెట్రిమారన్ సినిమాలంటేనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి .ఆయన తీసిన డుకాలం, విసారణై, వడాచెన్నై, అసురన్‌, విడుతలై ౧వంటి సినిమాలలో కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.ఆయన సినిమాలో స్టార్స్ కనిపించరు కేవలం ఆ పాత్రలే కనిపిస్తాయి.అటువంటి దర్శకుడితో రాంచరణ్ మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది.గతంలో ఎన్టీఆర్ తో వెట్రిమారన్ మూవీ ఉంటుందని తెగ ప్రచారం జరిగింది.కానీ అది వర్క్ అవుట్ కాలేదు.రీసెంట్‌గా రాంచరణ్ కు దర్శకుడు వెట్రి మారన్ అద్భుతమైన కథ వినిపించినట్లు సమాచారం..రాంచరణ్ కు కూడా కథ బాగా నచ్చిందని సమాచారం .త్వరలోనే వీరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం

Show comments