రామాయణం ఒక పవిత్రమైన హిందూ గ్రంథం. వాల్మీకి రామాయణం భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన ఇతిహాసం. మనిషి ఎలా జీవించాలో రామాయణం ద్వారా తెలుస్తుంది. రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు.. వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. తాజాగా ఈ రామాయణ గాథను పాకిస్థాన్ గడ్డపై ప్రదర్శించారు. కరాచీ నగరంలో ఓ నాటక బృందం ఈ భారతీయ ఇతిహాసాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించింద. ఇందులోని కళాకారులు పాకిస్థానీయులే కావడం విశేషం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్- AI మెరుగుదలను ఉపయోగించి ఇతిహాసానికి ప్రాణం పోసేందుకు ప్రయత్నించారు. ఈ నాటకాన్ని చూసిన స్థానిక పాకిస్థానీయులు ప్రసంశలు కురిపించారు.
READ MORE: Andhra Mahila Sabha Hospital: ఆసుపత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం
పాకిస్థాన్‌కు చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాకు నాటక రంగంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. థియేటర్ ఆర్ట్స్, పలు విభాగాల్లో శిక్షణ సైతం పొందారు. మరికొందరితో కలిసి నాటక బృందంతో కలిసి.. గత నవంబర్‌లో ది సెకండ్ ఫ్లోర్ (T2F) పేరిట ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. స్థానికుల నుంచి మంచి ఆదరణ లభించింది. వీరికి ఉత్సహం పెరిగింది. కృత్రిమమేధ సాయంతో వేదికను రంగులమయంగా మార్చి… ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో మూడు రోజులపాటు రామాయణాన్ని ప్రదర్శించారు. స్థానికులు సహా పలువురు ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
READ MORE: Bihar: మరో ఇల్లాలు ఘాతుకం.. ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య
“రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తే పాకిస్థాన్ ప్రజల నుంచి విమర్శలు, బెదిరింపులు ఎదురవుతాయని నేను ఎప్పుడూ భావించలేదు.. రామాయణాన్ని దృశ్యకావ్యంగా మలిచాం.. స్థానికుల నుంచి మద్దతు లభించడం గొప్ప విషయం. ఈ నాటకానికి ఆదరణతోపాటు నటీనటుల కృషికి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.” అని డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా వెల్లడించారు.
