NTV Telugu Site icon

Ramajogayya Sastry : దేనికైనా కాస్త ఓపిక, సహనం ఉండాలి.. వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ట్వీట్..

Ramajogayya Sastry

Ramajogayya Sastry

Ramajogayya Sastry : టాలీవుడ్ స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన రాసిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్స్ అందుకున్నాయి.ఆయన రాసిన ఐటెం సాంగ్స్ అయితే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటూ వుంటాయి.అయితే సూపర్ స్టార్ మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన “ఓ మై బేబీ” అనే సాంగ్ తీవ్ర వివాదానికి దారి తీసింది.ఆ పాట విడుదల అయిన కొద్దీ సేపటికే మహేష్ ఫ్యాన్స్ నుంచి ,నెటిజన్స్ నుంచి విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.అయితే ఆ ట్రోల్స్ కు రామజోగయ్య శాస్త్రి కాస్త పరుషంగా స్పందించడంతో మహేష్ ఫ్యాన్స్ ,నెటిజన్స్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also :Paruchuri Gopala Krishna : ఆ రెండు సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని తారా స్థాయికి తీసుకోని వెళతాయి..

రామజోగయ్య శాస్త్రిపై విమర్శల వెల్లువ ఆగలేదు.దీనితో ఆయన చివరకు ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టీవేట్ చేసారు..అయితే కొన్ని రోజులకు వివాదం సద్దు మునగడంతో మళ్ళీ ఆయన ట్విట్టర్ యాక్టీవ్ అయ్యారు.అయితే తాజాగా ఓ ఫ్యాన్ గుంటూరు కారంలో వివాదం సృష్టించిన సాంగ్ గురించి ట్వీట్ చేసారు.ఇలాంటి మంచి సాంగ్ ఇచ్చినందుకు రామజోగయ్య శాస్త్రి గారికి ,థమన్ కు థాంక్స్ అని ట్వీట్ చేయగా .రామజోగయ్య శాస్త్రి రియాక్ట్ అయ్యారు.జరక్కూడని రచ్చ జరిగిపోయాక ఇప్పుడేం లాభంలే నాన్నా..ఇందుకే… కాస్త ఓపిక సహనం ఉండాలంటారు అని ట్వీట్ చేసారు .ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది.