Ramabanam :ఎట్టకేలకు ఓటీటీ లో విడుదల కాబోతున్న రామబాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇటీవల నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఈ మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను శ్రీవాస్ తెరకెక్కించారు.. శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చి హిట్ గా నిలిచాయి. దీనితో రామబాణం ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధిస్తారని అంతా భావించారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ గా అంచనాలు పెరిగాయి..ఈ సినిమాలో డింపుల్ హయతి గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే జగపతి బాబు మరియు ఖుష్బూ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమా భారీ అంచనాలతో మే 5న థియేటర్స్ లోకి వచ్చింది. అయితే రామబాణం సినిమా ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయింది.
అయితే ప్రస్తుతం సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా నెల రోజుల్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి.అదే ఫ్లాప్ సినిమాలు అయితే మాత్రం ఏకంగా రెండు వారాల్లోనే ఓటీటీ లో విడుదల అవుతున్నాయి.. వేసవిలో విడుదల అయిన రామబాణం సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని గోపీచంద్ ఫ్యాన్స్ ఎదురు చూసారు.తాజాగా రామబాణం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 14 నుంచి రామబాణం సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది.. దీనితో గోపీచంద్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హీరో గోపిచంద్ నుంచి ఫుల్ యాక్షన్ మోడ్ మూవీ కోరుకుంటున్న ప్రేక్షకులకు రామబాణం వంటి ఫ్యామిలీ సినిమా అంతగా ఎక్కలేదు. దీనితో త్వరలోనే గోపీచంద్ ఫుల్ యాక్షన్ తో కూడిన చిత్రంతో ప్రేకక్షకుల ముందుకు రానున్నాడు.గోపి చంద్ రాధా మోహన్ దర్శకత్వంలో భీమా అనే ఫుల్ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల తో మరో మూవీ కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!