NTV Telugu Site icon

Double Ismart OTT: ‘డబుల్ ఇస్మార్ట్‌’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌.. భారీ ధరకు హక్కులు!

Double Ismart Ott

Double Ismart Ott

Double Ismart OTT Rights Price: 2019 రామ్ పోతినేని, పూరి జగన్నాధ్‌ కాంబోలో వచ్చిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్‌’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో సీక్వెల్‌గా ‘డ‌బుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినిమా ఇండిపెండెన్స్ డే కానుక‌గా గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. డబుల్ ఇస్మార్ట్ ‘సూపర్ హిట్‌’ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే రిలీజ్ సందర్భంగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలిసిపోయింది.

ఇదివరకు కొత్త సినిమాల ఓటీటీ పార్ట్​నర్​ ఎవరనేది అఫీషియల్​గా అనౌన్స్ చేసేవరకు తెలిసేది కాదు. ఇప్పుడు రిలీజ్ రోజే సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందనేది తెలిసిపోతోంది. విడుదల రోజే డిజిటల్ మీడియా పార్ట్​నర్స్​కు క్రెడిట్స్ ఇస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ డబుల్ ఇస్మార్ట్‌ సినిమా ఓటీటీ రైట్స్​ను భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం థియేట్రికల్‌ రన్‌ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్‌ డీల్ ఇంకా పూర్తికాలేదు.

Also Read: Vinesh Phogat Weight: వినేశ్‌ ఫొగాట్‌ బరువు పెరగడానికి ఆ మూడే కారణమా?

డబుల్ ఇస్మార్ట్‌ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్‍పాండే, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంను పూరి జగన్నాధ్‌, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా కోసం రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా రామ్ న‌టించిన‌ట్లు స‌మాచారం. ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకునే ఒప్పందం మీద ఆయన మూవీ చేసిన‌ట్లు స‌మాచారం.

 

Show comments