Double Ismart OTT: ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. భారీ ధరకు హక్కులు!
- మాస్ ఎంటర్టైనర్గా డబుల్ ఇస్మార్ట్
- సంబురాలు చేసుకుంటున్న రామ్ ఫ్యాన్స్
- డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Ismart OTT Rights Price: 2019 రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. డబుల్ ఇస్మార్ట్ ‘సూపర్ హిట్’ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే రిలీజ్ సందర్భంగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలిసిపోయింది.
ఇదివరకు కొత్త సినిమాల ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది అఫీషియల్‌గా అనౌన్స్ చేసేవరకు తెలిసేది కాదు. ఇప్పుడు రిలీజ్ రోజే సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందనేది తెలిసిపోతోంది. విడుదల రోజే డిజిటల్ మీడియా పార్ట్నర్స్కు క్రెడిట్స్ ఇస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ డీల్ ఇంకా పూర్తికాలేదు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Vinesh Phogat Weight: వినేశ్ ఫొగాట్ బరువు పెరగడానికి ఆ మూడే కారణమా?
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్‌పాండే, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంను పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా రామ్ నటించినట్లు సమాచారం. ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకునే ఒప్పందం మీద ఆయన మూవీ చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!