ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇటీవల హీరో శర్వానంద్ రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని జూన్ 9 న ఎంగేజ్మెంట్ చేసుకొని ఈయన కూడా పెళ్లి జీవితంలో కి అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ హీరో ఎవరో కాదు.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని..
అయితే, గత కొద్ది రోజుల నుంచి రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించినప్పటి కీ అందులో ఎలాంటి నిజం లేదు అంటూ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు రామ్.. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే చాలామంది యంగ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతున్నారు.. ఈ క్రమంలో రామ్ కూడా పెళ్లి వార్త చెప్పబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. ఇక ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో Rapo-19 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తోంది..
ఈ సినిమా షూటింగ్ అవ్వగానే రామ్ పెళ్లికి రెడీ అవుతున్నాడ ని వార్తలు వినిపిస్తున్నాయి.. రామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బిజినెస్ మ్యాన్ కూతురట.. హైదరాబాద్ లోనే ఉంటుందని టాక్.. అలాగే రామ్ పోతునేని ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టే తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని రామ్ ఫ్యాన్స్ అంటున్నారు.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే రామ్ క్లారిటి ఇచ్చేవరకు కొద్దిగా వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ వార్త విన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.. ఈ వార్త నిజమైతే బాగుండునని ఇండస్ట్రీలోని ప్రముఖులు కోరుకుంటున్నారు..