టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా సినిమా ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్లు అవుతున్న కూడా క్రేజ్ తగ్గలేదు.. ఇప్పుడు జనాలను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి డబుల్ ఇస్మార్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సైలెంట్ గా పూర్తి చేశారు.. అయితే ఈ సినిమాను మార్చిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో మార్చి నుంచి వాయిదా వేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు.. ఈ సినిమా కోసం రామ్ ఫ్యాన్స్ వెయిట్ చూస్తున్నారు.. కొత్త రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు ప్రకటించలేదు.. నిజానికి ఏప్రిల్ లో కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అందులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా కొన్ని సినిమాలు ఇప్పటికి రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకున్నాయి..
రామ్ ఫ్యాన్స్ మాత్రం కొత్త డేట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.. ఇక సమ్మర్ లో వచ్చే అవకాలు ఉన్నాయి.. తాజాగా హీరో రామ్ జూన్ లో విడుదల చేయబోతున్న క్లారిటీ ఇచ్చాడు.. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. రీసెంట్ గా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో భాగంగా డబుల్ ఇస్మార్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు.. జూన్ లో రిలీజ్ కన్ఫర్మ్ అవుతుందా? ఇంకా ఆలస్యం అవుతుందా? తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే ..
Ustaad @ramsayz About #DoubleISMART #DoubleISMART 🔱 releasing in June 💥🔥#RAmPOthineni #RAPO #RAPOxCMR pic.twitter.com/WnC9y5QaCv
— RAm POthineni Fc (@PothineniFc) March 20, 2024
