NTV Telugu Site icon

Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని

Untitled Design (19)

Untitled Design (19)

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా , దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ ఈ  చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రాబోతున్న ఈ సిక్వెల్ పై అటు రామ్ అభిమానులు, ఇటు పూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా రామ్ పోతినేని ఈ చిత్రానికి సంబంధించి తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ సెషన్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. రామ్ తన పాత్ర మాస్ అప్పీల్‌ను హైలైట్ చేస్తూ “మామ మాస్క్ ఉంటె నీకు దొంగడు మాత్రమే కనపడతడు, మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడతడు” అంటూ చెప్పిన పవర్ ఫుల్, ఇంటెన్షనల్ డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

డబుల్ ఇస్మార్ట్ మాస్ అప్పీల్, హై-ఆక్టేన్ యాక్షన్ మరియు డ్రామాటిక్ డెప్త్ ఉన్న కథ,కథనాలతో రాబోతుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో రామ్ పోతినేనితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటూ కావ్య థాపర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సంగీత మణిశర్మ రూపొందించగా, సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు మరియు జియాని గియానెలీ సంయుక్తంగా అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కానుంది డబుల్ఇస్మార్ట్. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుండడంతో లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

Also Read : MR. Bachhan: తొలి చిత్రంతోనే అదరగొట్టిన మాస్ మహారాజ బ్యూటీ..

 

Show comments