NTV Telugu Site icon

Ram Gopal Varma: వర్మ కంట పడ్డాకా.. ఏ అమ్మాయి అయినా దానికి ఒప్పుకోవాల్సిందే

Saree

Saree

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే ఆర్జీవీకి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. అయితే గొడవలు లేకపోతే అమ్మాయిలు, మందు తప్ప వర్మకు వేరే యావగేషన్ లేదు అంటే అతిశయోక్తి లేదు. ఒక నార్మల్ సాదాసీదా అమ్మాయిలను స్టార్ సెలబ్రిటీగా చేయగల దమ్మున్న డైరెక్టర్ ఎవరు అంటే ఆర్జీవి అని చెప్పొచ్చు. సినిమాల వల్లనే అమ్మాయిలు సెలబ్రిటీలు అవుతారు అనుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఆర్జీవి కంట్లో పడిన అమ్మాయి హీరోయిన్ కాకముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే ఆర్జీవి కంట్లో పడిన ప్రతి ఒక్క అమ్మాయి సెలబ్రిటీగా కొనసాగుతుంది. ఇక ఈమధ్యనే శారీ గర్ల్ అని ఒక అమ్మాయి నచ్చిందని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ఆమె పేరు శ్రీలక్ష్మీ. ఇక ఆమె గురించి చెప్తూ.. ఆమెతో ఒక సినిమా తీయాలని ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక చెప్పినట్లే శ్రీలక్ష్మీతో సినిమా తీశాడు వర్మ. శారీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. గత రెండు రోజుల నుంచి వర్మ.. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ.. ఆమెను ఒక రేంజ్ లో పొగిడేస్తున్నాడు. అఘోష్ వైష్ణవం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్జీవీ నిర్మిస్తున్నాడు. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కించాడని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక కథ ఎలా ఉంటుందో కూడా వర్మ వివరించాడు. ఒక పల్లెటూరుకు ఒక అబ్బాయి స్నేహితులతో కలిసి టూర్ కు వస్తాడు. అక్కడ శారీలో ఉన్న హీరోయిన్ ను చూసి ప్రేమిస్తాడు. కానీ, హీరోయిన్ అతడిని రిజెక్ట్ చేస్తోంది. దీంతో ఆమె మీద వ్యామోహంతో అతడు ఎంతవరకు వెళ్ళాడు.. ? హీరోయిన్ ను ఎలా సొంతం చేసుకున్నాడు.. ? హీరోయిన్ అతడి నుంచి తప్పించుకుందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఏ మాటకు ఆ మాట శారీ గర్ల్.. చీరలో చాలా అద్భుతంగా ఉంది. ఈ పోస్టర్స్ చూశాక అభిమానులు వర్మ కంట పడ్డాకా.. ఏ అమ్మాయి అయినా హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకోవాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఈ భామ ఫేట్ మారుస్తుందేమో చూడాలి.