NTV Telugu Site icon

Ram Gopal Varma: వర్మ ఒళ్లో మరో అందమైన భామ.. ఎవరో తెలుసా?

Varmaa

Varmaa

తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం.. వివాదాలకు పెట్టింది పేరు.. ఈ సినిమాలు కూడా అదే విధంగా వివాదాస్పదంగా మారుతున్నాయి.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని కూడా విమర్శలను అందుకున్నాయి.. ఇక ఆయన చేసిన కామెంట్స్ కూడా అంతే వైరల్ అవుతూ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆర్జీవీ చాలా యాక్టివ్ గా ఉంటారు..

సినిమాల పై విమర్శలను మాత్రమే కాదు.. రాజకీయాలపై కూడా కామెంట్స్ చేస్తుంటాడు వర్మ.. ఇటీవలే ఆయన సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ ను పట్టుకున్నారు. సోషల్ మీడియా లో వీడియోలు చేసే ఓ యువతీ అందానికి ఫిదా అయ్యారు ఆర్జీవీ. ఆమె ఎవరు అంటూ నెటిజన్స్ ను అడిగిమరీ ఆమెను వెతికి పట్టుకున్నారు. ఆమెతో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు.. తాజాగా ఓ ఫోటోను కూడా నెట్టింట వైరల్ అవుతుంది…

చేతిలో మందు గ్లాస్ తో ఓ అందమైన అమ్మాయితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ సంచలన దర్శకుడు. ఆర్జీవీ పక్కన ఉన్న ఈ అమ్మాయి సిరి స్టేజీ.. అర్జీవిని ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సొంతం చేసుకుంది సిరి స్టేజీ. ఆతర్వాత అర్జీవితో కలిసి కనిపిస్తూ హల్ చల్ చేసింది ఈ చిన్నది. తాజాగా ఈ ఇద్దరు పబ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను నెట్టింట పంచుకున్నారు ఆర్జీవీ. ఆమెతో కలిసున్నా ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..