Site icon NTV Telugu

Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్

Peddi

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఓ వైపు స్వయంగా రామ్ చరణే ఈ సినిమా వాయిదా పడడం లేదని క్లారిటీ ఇచ్చిన కూడా.. విడుదల తేదీకి నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో.. సోషల్ మీడియాలో పోస్ట్‌పోన్ వార్తలు గట్టిగా  వినిపించాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్‌లో రిలీజ్ డేట్ వేయలేదు మేకర్స్. ఇది పెద్ది రిలీజ్ పై పై డౌట్ వచ్చేలా చేసింది.

Also Read : NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర

కానీ ఆ వార్తలేవి నిజం కాదని విశ్వసనీయంగా తెలిసింది. కేవలం ఒక ఐటెం సాంగ్ మినహా టాకీ పార్ట్ అంతా  రీ-రికార్డింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మరో వారంలో అవన్నీ ఫినిష్ అవుతాయని రామ్ చరణ్ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 30న పెద్ది బాక్సాఫీస్ బరిలో దిగడం పక్కా ఈ విషయంలో  నోడౌట్ అని యూనిట్ వర్గాల మాట. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సమాచారం అందిచారట. అలాగే ఏప్రిల్ 8న పెద్ది ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఏప్రిల్ 30కే సినిమా వస్తుందని ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. చిత్ర యూనిట్ ప్యాచ్ వర్క్‌తో పాటు.. ఐటెం సాంగ్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు గట్టిగా శ్రమిస్తోంది. పెద్ది రిలీజ్ కన్ఫర్మ్ కావడంతో నిఖిల్ నటిస్తున్న స్వయంభు, అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాల రిలీజ్ పై క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version