NTV Telugu Site icon

Ram Charan : ‘గేమ్ చేంజర్’ సినిమాకు గ్యాప్.. వేకేషన్ కు ఎవరితో వెళ్తున్నారో తెలుసా?

Ram (3)

Ram (3)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా మొదలై మూడేళ్లు అయ్యింది.. ఇప్పటికి విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరగండి సాంగ్ ను విడుదల చేశారు.. ఆ సాంగ్ విమర్శలను అందుకోవడం జరిగింది.. ఇప్పటికి ట్రోల్స్ ఆగడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు కదా.. ఇక తాజాగా రామ్ చరణ్ షూటింగ్ కు గ్యాప్ తీసుకున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం వైజాగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.. అయితే ఇప్పుడు ఆ షూటింగ్ కు గ్యాప్ తీసుకున్నారని తెలుస్తుంది.. తాజాగా చరణ్ వెకేషన్ కి వెళ్తున్నారని సమాచారం. తన పెంపుడు కుక్కపిల్ల రైమ్ తో కలిసి రామ్ చరణ్ వెకేషన్ కి వెళ్తున్నారని సమాచారం. ఫ్లైట్ లో చరణ్, రైమ్ కూర్చొని దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఎక్కడికి వెళ్లినా రామ్ చరణ్ తో తన భార్య ఉపాసన వెళ్ళేది.. కానీ ఇప్పుడు రైమ్ తో వెళ్తున్నారేంటో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి..

ఇకపోతే గేమ్ ఛేంజర్ సినిమా ప్రస్తుతం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారని, నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుందని టాక్.. దాంతో వేకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.. మరి చరణ్ ఎక్కడకు వెళ్లారో తెలియలేదు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత సుకుమార్ తో రంగస్థలం 2 సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి..