Site icon NTV Telugu

Anushaka : సో స్వీట్ ఆఫ్ యు చరణ్ అంటున్న అనుష్క

New Project (16)

New Project (16)

Anushaka : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టీజర్‎లోని సీన్స్ రిఫ్రెషింగ్ గా ఉండడమే కాకుండా మంచి ఫన్ కూడా ఉంది. దీంతో ఆడియన్స్‎కి ఈ టీజర్ విపరీతంగా నచ్చేసింది. ప్రేక్షకులని మాత్రమే కాదు స్టార్ హీరోలకు కూడా ఈ టీజర్ నచ్చేస్తుంది.

Read Also:Ankit Love: ప్రధాని మోడీకి క్షమాపణ.. తల్లి అంత్యక్రియల కోసం ఎమర్జెన్సీ వీసా మంజూరు..

రీసెంట్ గా వచ్చిన టీజర్ అయితే మంచి అంచనాలు తెచ్చి పెట్టింది. ఇక నిన్ననే ఈ సినిమా టీజర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆసక్తి వ్యక్తం చేశారు. ఇక లేటెస్ట్ గా స్వీటీ అనుష్క అయితే ఓ బ్యూటిఫుల్ రిప్లై ఇచ్చింది. సో స్వీట్ ఆఫ్ యు చరణ్ అంటూ..మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ని భార్య ఉపాసన తో కలిసి తప్పకుండా చూడు అంటూ థాంక్స్ చెప్పింది. దీనితో చరణ్ కి అనుష్క ఇచ్చిన ఈ క్యూట్ రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా అతి త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ్, మళయాళ కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

Read Also:Pooja Hegde :ఫుల్ జోష్ లో పూజా.. పొట్టి డ్రెస్ లో రచ్చ రచ్చ

అయితే రామ్ చరణ్ కి నవీన్ పోలిశెట్టి ఇచ్చిన రిప్లై అందర్నీ ఆకట్టుకుంటుంది. “మీ ట్వీట్ చూసి మాకు తెలియకుండానే నాటు నాటు స్టెప్ వేస్తున్నాము. సినిమాల్లో మీ నిర్ణయాలతో గేమ్ చెంజర్ గా ఉండి మాకు స్ఫూర్తిని ఇస్తునందుకు థాంక్యూ రామ్ చరణ్ గారు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Exit mobile version