NTV Telugu Site icon

Ram Charan-Sukumar:సుక్కు ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Charan Sukku

Charan Sukku

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆల్రెడీ సెట్స్ మీద గేమ్ చేంజర్ సినిమా ఉండగా ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు… చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆ సినిమాలను అధికారికంగా ప్రకటించారు.. ఆ సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. దీంతో తదుపరి సినిమాల పై చరణ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. ముందుగా చరణ్ 16 వ సినిమాగా రాబోతున్న బుచ్చి బాబు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు..

ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు.. జూన్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా సుకుమార్ తో రంగస్థలం 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని రామ్ చరణ్ భావిస్తున్నారని తెలుస్తుంది.. సుక్కు ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు టాక్..

సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాను ఆగస్టు 15 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పై ఫోకస్ పెట్టాడు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుంది.. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ రానుందని సమాచారం.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు రాబోతున్న సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి..