Site icon NTV Telugu

Ram-Charan రామ్ చరణ్ – భన్సాలీ ‘మెగా’ మ్యాజిక్.. విజయేంద్ర ప్రసాద్ కథతో జంగిల్ అడ్వెంచర్!

Ram Charan And Director Sanjay Leela Bhansali

Ram Charan And Director Sanjay Leela Bhansali

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ ‘ది లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్’ కోసం చర్చలు జరిపినా, ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే తాజాగా, వీరిద్దరి మధ్య సరికొత్త కథా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించిన ఒక ఐడియాను బేస్ చేసుకుని, ‘గుల్లక్ 2’ ఫేమ్ దుర్గేష్ సింగ్ ఈ స్క్రిప్ట్‌ను డెవలప్ చేశారట. ఇది ఒక పీరియడ్ జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని, చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. ఆ తర్వాత సుకుమార్‌తో తన 17వ సినిమా (RC17) ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు, సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్ మరియు విక్కీ కౌశల్‌లతో ‘లవ్ అండ్ వార్’ (Love & War) షూటింగ్‌ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ షెడ్యూల్స్ అన్నీ పూర్తయిన తర్వాతే భన్సాలీ-చరణ్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లోపు స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా భన్సాలీని కలిసినట్లు వార్తలు వచ్చాయి, కానీ రామ్ చరణ్‌తో ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version