Site icon NTV Telugu

Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి రామ్ చరణ్ లుక్ లీక్.. అదిరిపోయిందిగా..

Ram Charan Look

Ram Charan Look

గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ సినిమాకి శంకర్ దర్శకుడు కావడం, మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తుండడంతో పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపోందిస్తున్నారు.. ఈ మూవీ అనౌన్స్ చేసి మూడేళ్లు అయ్యిపోయింది. కానీ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. ఇక ఈ మూడేళ్లలో మేకర్స్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని బాధ పెడుతూ వస్తున్నారు. అయితే ఒక్క అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ మిగులుతుంది.. కానీ అప్పుడప్పుడు సినిమా నుంచి లీకైన ఫోటోలు, వీడియోలతో సరిపెట్టుకుంటున్నారు..

గతంలో కీలక సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు చాలా సార్లు లీక్ అయ్యాయి.. ఇప్పుడు మరోసారి వీడియో లీక్ అయ్యింది.. వైజాగ్‍లో గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్ నుంచి రామ్‍చరణ్ ఫొటోలు కొన్ని తాజాగా లీక్ అయ్యాయి. వీటి ద్వారా ఈ చిత్రంలో రామ్‍చరణ్ కొత్త లుక్ రివీల్ అయింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పూర్తిగా క్లీన్ షేవ్, మీసంతో రామ్‍చరణ్ ఈ నయా లుక్‍లో అదిరిపోయారు. స్పెక్ట్స్ ధరించి క్లాస్ లుక్‍లో సూపర్‌గా ఉన్నారు.. ఈ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు..

Exit mobile version