NTV Telugu Site icon

Ram Charan : రామ్‌చరణ్‌ని అవమానించలేదు.. వీడియోతో షారుఖ్ క్లారిటీ..

Sharukh (7)

Sharukh (7)

గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల వివాహ వేడుకలకు వెళ్లిన విషయం తెలిసిందే.. ఈ ఈవెంట్ కి దాదాపు బాలీవుడ్ లోని అందరూ స్టార్స్ హాజరుకాగా.. సౌత్ నుంచి రజినీకాంత్, రామ్ చరణ్, అట్లీ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో ఈ స్టార్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి…

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. ఆ డాన్స్ సమయంలోనే షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ ని వేదిక మీదకి పిలిచి.. నాటు నాటు స్టెప్ ని ఖాన్స్ అందరూ కలిసి చరణ్ తో వేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకి వచ్చింది.. రామ్ చరణ్ ను పిలిచేటప్పుడు షారుఖ్ ఇడ్లీ వడ రామ్ చరణ్ అని పిలిచాడు..

షారుఖ్ ఇలా అనడంతో టాలీవుడ్ లోని ఫ్యాన్స్ రామ్ చరణ్ ను అవమానించాడు అని ప్రచారం చేశారు.. షారుఖ్ సారీ చెప్పాలంటూ పేర్కొంటున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్‌ని చెప్పాడు. ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన షారుఖ్ అభిమానులు.. తాను నటించిన సినిమాలోని డైలాగు అని చూపించాడు.. అయితే సౌత్ ఆడియన్స్ కి ఆ డైలాగ్ గురించి తెలియకపోవడంతో.. చరణ్ ని అవమానించారని భావించి తెగ ఫీల్ అయ్యిపోయారు.. ఏది ఏమైన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..